అన్ని ప్రాంతాల అభివృద్దే తమ అభిమతమన్న బొత్స || Botsa Sathyanarayana Comments On Pawan Kalyan

2019-09-03 1,645

Amaravati may not become Andhra Pradesh's new capital, Botsa Satyanarayana, Minister of Municipal Administration and Urban Development, hinted today, pointing to the fact that large sections of the region were left flooded by heavy rain. "The Sivaramakrishna Committee pointed out that Amaravati is not a safe place for capital city. Many areas in the capital region are flood-prone, as you have been seeing," the minister said
#BotsaSathyanarayana
#Amaravathi
#ysrcp
#jagan
#tdp
#chandrababu
#sujanachowdray
#PawanKalyan

రాష్ట్ర రాజధాని అమరావతిలో వెయ్యి కుంభకోణాలు జరిగినట్లు కొద్ది రోజులుగా సీఆర్‌డీఏ సమీక్షల్లో తేటతెల్లం అవుతోందని, రాజధాని చుట్టూ భూకుంభకోణాలు అల్లుకుని ఉన్నాయని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ‘‘రాజధానిలో జరిగిన దోపిడీపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధనానికి జవాబుదారీగా ఉండాల్సిన వారే దారుణంగా దోపిడీకి పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిందేనని ఎవరైనా అంటారు. కానీ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎందుకు వత్తాసు పలుకుతున్నాడో... దోపిడీని పక్కదోవ పట్టించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడో అర్థం కావడం లేదు. పవన్‌ కల్యాణ్‌ మైండ్‌సెట్, జనసేన పార్టీ అజెండా మారలేదనిపిస్తోంది. జనసేన పార్టీ అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది. ఎవరి తీరు ఏమిటో ప్రజలు గమనిస్తున్నారు'' అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.